మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం కారంపూడిలో జరగనున్న వీర మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల నుంచి పర్యాటకులు, వీరాచారవంతులు పాల్గొంటారని, సనాతన సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక రైతు సంఘం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కూడా నిర్వహించనున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa