వంకాయ సాగులో సరైన సస్యరక్షణ లేకపోతే పంటకు చీడపీడలు భారీ నష్టం చేస్తాయి. ముఖ్యంగా ఆకు మాడు తెగులు సోకితే ఆకులపై గోధుమ–పసుపు మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు 10 రోజులకు ఒకసారి లీటరు నీటిలో 1 గ్రామ్ కార్బెండజెమ్ పిచికారి చేయాలి. కాయకుళ్లు తెగులు వస్తే కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఉపయోగించాలి. వెర్రితెగులు సోకితే ఆకులు చిన్నగా, మొక్కలు గుబురుగా మారతాయి. దీనికి పరిష్కారంగా తెగులు సోకిన మొక్కలను తొలగించి, లీటరు నీటికి 2 ml మిథైల్ డెమాటన్ పిచికారి చేయాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa