దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి అదృశ్యం అవుతున్నారనే వార్తలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొన్న ధర్మాసనం, దత్తత ప్రక్రియ సంక్లిష్టంగా ఉందని, దానిని సక్రమంగా మార్చాలని సూచించింది. పిల్లల అక్రమ రవాణాకు దారితీస్తున్న ఈ ప్రక్రియపై కేంద్రం స్పందించాలని కోరింది. మిస్సింగ్ కేసుల పరిశీలనకు నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని కేంద్రం కోరగా, డిసెంబర్ 9లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa