హైదరాబాద్: ఐఫా ఉత్సవాల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేసింది. క్యాట్ వాక్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమపై వచ్చిన కొన్ని జోక్స్ చూశానని.. ఐఫా ఉత్సవాల సందర్భంగా తమపై కొన్ని జోక్స్ ప్లే చేస్తారని ముందే సమాచారం వచ్చిందని ముద్దుగుమ్మ తెలిపింది. వాటన్నింటినీ తను స్పోర్టివ్‌గా తీసుకుంటున్నానని చెప్పింది. నానీ, రానా తనకు మంచి ఫ్రెండ్స్ అని అమ్మడు చెప్పింది.