డయావెల్‌ డీజిల్‌.డుకాటీ రూ.20లక్షల బైక్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 28, 2017, 01:34 PM
 

 ద్విచక్ర వాహనాల సంస్థ డుకాటీ పరిమిత శ్రేణిలో డయావెల్‌ డీజిల్‌ మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.19.92 లక్షలు (ఎక్స్‌షోరూం, దిల్లీ)గా నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వాహనాలు 666 మాత్రమే ఉత్పత్తి చేస్తామని, ఈ బైకు కోసం ప్రత్యేకంగా ఆర్డరు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ప్రత్యేక వాహనాలను తీసుకొచ్చేందుకు డుకాటి, డీజిల్‌ సంస్థలు 2012లో చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం డుకాటికి అవసరమైన జాగ్‌ జీన్స్‌లు, లెదర్‌ జాకెట్లు, టి-షర్టులు వంటి వాటిని డీజిల్‌ అందిస్తుంది. ఈ కొత్త బైకుకు సంబంధించిన జాకెట్లు, టి-షర్టులు వంటి వాటిని త్వరలోనే డుకాటి విక్రయ కేంద్రాల్లో అందుబాటులోకి రానున్నాయని సంస్థ పేర్కొంది. దేశీయంగా ఆగస్టులో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.