తితిదే మాజీ ఛైర్మన్, వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు.శనీశ్వరుడి విగ్రహంపై వచ్చిన వివాదంతో సంబంధం ఉన్న ఈ నోటీసులో, ఆయనను శనివారంలోపు విచారణకు హాజరుకావాలని కోరారు.ఇప్పటికే తితిదేపై అసత్య ప్రచారం చేసిన ఆరోపణలతో భూమనపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.అలిపిరి వద్ద ఉన్న శనీశ్వరుడి విగ్రహానికి సంబంధించి భూమన చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని, ఆ విగ్రహంపై అపచారం జరిగిందని అసత్యంగా పేర్కొన్నారని తితిదే అభిప్రాయపడింది.ఈ నేపథ్యంలో, డిప్యూటీ ఈవో గోవిందరాజు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమన చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నారు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను ప్రారంభించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa