లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఏసీబీ కోర్టు రెండు రోజులు కస్టడీకి అనుమతించింది. మిథున్‌రెడ్డిని విచారించేందుకు 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం రెండు రోజులు కస్టడీకి అనుమతిచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ఎంపీ మిథున్‌రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa