శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 28, 2017, 09:21 AM
 

శ్రీశైలం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో మూడో రోజు ఉగాది ఉత్సవాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. స్వామివారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. భ్రమరాంబ అమ్మవారు రాత్రి 7 గంటలకు మహా సరస్వతి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. అనంతరం పురవీధుల్లో నందివాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుంది.