ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరంతో కరువును జరుుస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 01:52 AM

 వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో జలసిరులు  త్రీగోర్జెస్‌కు తీసిపోదన్న  ముఖ్యమంత్రి చంద్రబాబు


 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన సమావేశం  ప్రాజెక్టు సత్వర పూర్తికి రోజూ ప్రార్ధిద్దామని పిలుపు


అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : రాష్ట్రాన్ని సుభిక్షం చేసే శక్తిసామర్ధ్యాలు పోలవరం ప్రాజెక్టుకు ఉన్నాయని, ఏడాది పాటు వర్షాలు లేకున్నా, తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా నీటి సమస్య తలెత్తే అవకాశమే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరాన్ని 2018 కల్లా పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరందించి తీరతామని చెప్పారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకు లేనంతగా అత్యంత పొడవైన అప్రోచ్‌ చానల్‌, అత్యంత ఎత్తయిన గేట్ల ఏర్పాటు, అత్యంత లోతు నుంచి డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం  పోలవరం ప్రాజెక్టు ఘనతలుగా పేర్కొన్నారు. చైనా త్రీగోర్జెస్‌ ప్రాజెక్టుకు ఏమాత్రం తీసిపోదని చెప్పారు.  సోమవారం శాసనసభ కమిటీహాలు-2లో పోలవరం ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన అవగాహన సమావేశంలో పోలవరం, అమరావతి రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమని ముఖ్యమంత్రి అన్నారు. పోలవరం నుంచి ఏయే ప్రాజెక్టులకు ఎలా నీటిని తరలిస్తాం, ఎలా వినియోగించుకుంటాం అనే అంశాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్వయంగా ముఖ్యమంత్రి వివరించారు. సోమవారం అంటేనే పోలవారం అనుకునేం తగా ముద్రపడిపోయేలా ప్రాజెక్టు నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్టు చెప్పారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ఇలా రాయలసీమలో ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసేందుకు పోలవరం ప్రాజెక్టుతో సాధ్యమవుతోందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 40 టీఎంసీల నీటిని రిజర్వాయరులో భద్రపరిచి, నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు తరలిస్తామన్నారు. అమరావతికి ఎగువన 10 టీఎంసీల సామర్ధ్యంతో బ్యారేజ్‌ నిర్మాణానికి యోచిస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి అమరావతి నగర భవిష్యత్‌ నీటి అవసరాలను  ఈ నిర్మాణంతో తీర్చాల్సి వుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్‌ ద్వారా ఆర్ధిక సహకారం అందుతోందని, ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని ముఖ్యమంత్రి అన్నారు. ఏటా వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుకుండా రాష్ట్రానికి ఉపకరించేలా చేయాలన్నదే తన సంకల్పంగా చెప్పారు. భూసేకరణకు పెద్దమొత్తంలో పరిహారం అందిస్తున్నామని దీంతో అంచనా వ్యయం పెరిగిందని అన్నారు.  అటు అధికారులు కూడా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని, స్పిల్‌ వే - స్పిల్‌ చానల్‌ తదితర నిర్మాణాల వివరాలను సభ్యులకు ఆసక్తి కలిగిలా అధికారులు తెలియజేశారు. వివిధ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com