సిన్సినాటి: అమెరికాలోని ఓ నైట్‌క్లబ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటి కామియో నైట్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుఝామున ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరపగా ఓ వ్యక్తి మరణించాడు. 13 మంది గాయపడ్డారు. కాల్పులు జరిగినట్లు సిన్సినాటి పోలీసులు ధృవీకరించారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని వెల్లడించారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు నైట్‌క్లబ్‌కు చేరుకున్నారు. ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్‌క్లబ్‌లో ఓ ఉగ్రవాది 49 మందిని కాల్చి చంపిన ఘటన జరిగిన ఏడాదిలోపే మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది.