పవర్ స్టార్‌తో రెండు సినిమాల్లో నటించిన ఫస్ట్ హీరోయిన్గా క్రెడిట్ కొట్టేసిన శృతి హాసన్ ఫుల్ ఖుషీగా ఉంది. 'కాటమరాయుడు' లో పవన్ కళ్యాణ్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ కావడమే ఇందుకు కారణమని శృతి క్లోజ్ సర్కిల్స్‌లో అనుకుంటున్నారు. మూవీకి మంచి రివ్యూస్ రావడంతో శృతి ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. దాంతో వరుస ట్వీట్లతో తన ఆనందాన్ని పంచుకుంటున్నది. కాటమరాయుడు లేటెస్ట్ పోస్టర్స్‌ను ట్వీట్ చేసిన శృతి తన తాజా ఫొటోను కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.