ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఇకపై ఆధార్ తప్పనిసరి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 11:48 AM

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు త్వరలో కఠినతరం కానున్నాయి. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ కలవారు, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఇకపై తమ ఆధార్ కార్డు వివరాలను తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఒకే పేరుతో అనేక డ్రైవింగ్ లైసెన్సులు పొందేవారిపై చర్యల కోసం కేంద్రం త్వరలో ‘ఆధార్’ను తప్పనిసరి చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు కోసం దరఖాస్తు చేసుకునేవారితోపాటు రెన్యువల్ చేయించుకునేవారు సైతం ఆధార్ వివరాలను సమర్పించాలి. ఒకటికి మించి డ్రైవింగ్ లైసెన్సులు కలిగినవారు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఇప్పటికే పనులు ప్రారంభించింది. డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండటంతో కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో లోపాల వల్ల ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాలు లేదా రాష్ట్రాల నుంచి డ్రైవింగ్ లైసెన్సులను పొందే పరిస్థితి ఉంది. ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేస్తే రెండో సారి ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా వెంటనే పట్టుబడిపోతారు. ఈ ఏడాది అక్టోబరు నెల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com