ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 04:35 PM

 అమరావతి: జగన్‌.. ఓ వింత ప్రవర్తన కలిగిన వ్యక్తిగా తెదేపా ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అభివర్ణించారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.... తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌కు ఆత్మ కేవీపీ నీడగా ఉండేవారన్నారు. మరి జగన్‌ వెంట ఎందుకు లేరని ప్రశ్నించారు. ఆయన వంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్‌.. తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు.


అన్నీ సీఎం అయ్యాకే అంటారు.. ప్రతిపక్ష నేత జగన్‌పై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విరుచుకుపడ్డారు. సాక్షి పత్రికను అడ్డంపెట్టుకుని అవాస్తవాలు రాయిస్తుంటారని వ్యాఖ్యానించారు. ఆయన ప్రవర్తననచ్చకే 21 మంది ఎమ్మెల్యేలం తెదేపాలో చేరామని చెప్పారు. జగన్‌ వయసు తక్కువ.. ఆశ ఎక్కువ అని వ్యాఖ్యానించారు. ఎవరైనా వెళ్లి ఏదైనా కావాలని అడిగితే.. అన్నీ సీఎం అయ్యాకే అంటారు అని విమర్శించారు. చివరికి భార్యాభర్తల పంచాయితీకి కూడా సీఎం అయ్యాకే అంటారని చమత్కరించారు. ఆయనకు డబ్బు మీద యావ, పదవి మీద వ్యామోహమని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com