తెలుగుదేశం పార్టీ మే నెలలో పులివెందుల వేదికగా నిర్వహించే మహానాడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చనుందనే చర్చ జరుగుతోంది. జగన్ సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఒక సవాల్‌గా భావిస్తున్నారు. పులివెందులలో మహానాడు నిర్వహణ ద్వారా టీడీపీ సత్తా ఏమిటో తెలియజేయడమే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపడంతో పాటు ప్రత్యర్థి పార్టీ వైసీపీకి బలమైన రాజకీయ సంకేతాలను పంపుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు ప్రణాళికతో పాటు 2047 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించడంతో పాటు టీడీపీ ప్రభుత్వం యొక్క అవసరాన్ని వివరించడమే లక్ష్యంగా మహానాడు నిర్వహించే అవకావం ఉన్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |