సర్జికల్ స్ట్రైక్స్‌కి నాయకత్వం వహించిన సూరికి కీర్తి చక్ర

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 21, 2017, 08:50 AM
 

సరిహద్దులు దాటి పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్‌ జరిపిన సైనిక దళానికి నాయకత్వం వహించిన మేజర్ రోహిత్ సూరికి శాంతికాలపు రెండో అత్యున్నత పురస్కారమైన కీర్తి చక్ర లభించింది.  రాష్ట్రపతిభవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మేజర్ సూరి రాష్ట్రపతి ప్రణబ్ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వీరోచింగా పోరాడి అమరుడైన కార్పోరల్ గురుసేవక్‌సింగ్‌కు మరణానంతర శౌర్యచక్ర లభించింది. దీర్ఘకాలం రక్షణ దళాలకు సేవలందిస్తున్న నలుగురు సీనియర్ అధికారులకు పరమ విశిష్ట సేవా మెడల్, 22 మందికి అతివిశిష్ట సేవా మెడల్, 15 మందికి పరమ విశిష్ట సేవా మెడల్ అందజేశారు.