అడ్డదారుల్లో ఎమ్మెల్సీల గెలుపు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 21, 2017, 12:55 AM
 

 వైసీపీ నుంచి బిఫావ్గు పొందిన అభ్యర్థులే ఎక్కువ  దీనిపై న్యాయపోరాటం చేస్తా  ముఖ్యమంత్రి స్థారుుకి ఇది తగునా  వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి


  విజయవాడ, మేజర్‌ న్యూస్‌ : ఎంపీటీసీ, జెడ్పీ టీసీలను అడ్డగోలుగా కొను గోలు చేయడం ద్వారా, పోలీ సులతో భయపెట్టడం ద్వారా నే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని, ఇదేనా ప్రజా స్వామ్యామా అంటూ ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు, నెల్లూరు, కడప ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితా లపై వైసీపీ అధినేత జగన్‌  ఘాటుగా స్పందించారు. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బిఫామ్‌ తో గెలిచిన అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు భయపెట్టి, ప్రలోభ పెట్టా రని ఆరోపించారు. ఆ విధంగా గెలిచిన గెలుపును  అసెంబ్లీ నిండు సభలో ఏదో ఘనత సాధించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కడప లో మొత్తం 845 మందిలో 521 మంది వైసీపీ అభ్యర్థులని, టీడీపీ అభ్యర్థులు 303 మంది అని చెప్పారు. టీడీపీకి 403 ఓట్లు, వైసీపీకి 399 ఓట్లు వచ్చాయన్నారు. నెల్లూరులో మొత్తం 847 అభ్యర్థులలో 435 మంది వైసీపీ అభ్యర్థులు కాగా, 340 మంది మాత్రమే టీడీపీ అభ్యర్థులని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీకి 377 ఓట్లు, టీడీపీకి 462 ఓట్లు వచ్చాయన్నారు. కర్నూలులో 531 మంది వైసీపీ అభ్యర్థులు ఉండగా, టీడీపీ అభ్యర్థులు 454 మంది ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీకి 501 ఓట్లు, టీడీపీకి 565 ఓట్లు వచ్చాయన్నారు. టీడీపీ బలంగా ఉన్న చోటు తాము అభ్యర్థులను నిలపలేదని జగన్‌ చెప్పు కొచ్చారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించాలని జగన్‌ సవాల్‌ విసిరారు.


      ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో సహా అడ్డంగా దొరికి పోయిన సీఎం చంద్రబాబు చిత్తశుద్ది గురించి మాట్లాడడం హాస్యాస్ప దమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల జరిగిన తీరుపై న్యాయపోరాటం చేస్తానని జగన్‌ స్పష్టం చేశారు.