బీటెక్‌ రవి విజయంతో వైసీపీ పతనం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 07:46 PM
 

కడప : కడపలో బీటెక్‌ రవి ఎమ్మెల్సీగా గెలవడంతో వైసీపీ పతనం మొదలైందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ… 2019లో కడప జిల్లాలో పులివెందుల సహా అన్ని స్థానాల్లో గెలుస్తామన్నారు. జగన్‌ మానసికంగా దెబ్బతిన్నారని, అభివృద్దిని అడ్డుకుంటున్నారన్నారు. కడప జిల్లాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.