రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు!

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 07:07 PM
 

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నట్లు సమాచారం. చెర్రీ-ఉపాసనా ప్రేమించి పెళ్లి చేసుకుని జరిగి ఐదేళ్లు గడిచిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా చరణ్, ఉపాసనాలను వెంటాడుతున్న ప్రశ్న పిల్లలు గురించి ఏం అనుకుంటున్నారు? అని.. ఇన్నాళ్లుగా ఆ ప్రశ్నకు జవాబు దాటవేస్తూ వస్తోన్న ఈ జంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం ఉపాసన గర్భం దాల్చిందని తెలుస్తోంది. రీసెంట్‌గానే తమ కుటుంబంలోకి వారసుడిని తీసుకురావాలని ఈ జంట నిర్ణయం తీసుకుందట.ఈ విషయం తెలిసిన మెగాభిమానులు తమ బుల్లి మెగాస్టార్ రాబోతున్నాడని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ ఈ సంగతి తెలిసిన మెగా ఫ్యామిలీ ఆనందోత్సాావాల్లో మునిగిపోయిందని తెలుస్తోంది.