ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.18 లక్షలు చెల్లించి రికార్డుకెక్కారు

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 06:55 PM
 
తిరువనంతపురం: ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.18 లక్షలు చెల్లించి రికార్డుకెక్కారు. కేరళ ఆర్టీఏ అధికారులు సోమవారం కెఎల్ 01 సిబి 1 ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలం నిర్వహించారు.తిరువనంతపురానికి చెందిన ఫార్మసీ యజమాని కేఎస్ బాల‌గోపాల్ ఇందులో పాల్గొన్నారు. కోటి ఖరీదైన కొత్త టయోటా ల్యాండ్ క్రూజ్ కోసం రూ.18 లక్షలతో దీన్ని దక్కించుకున్నారు. ఫ్యాన్సీ నెంబర్ల ఆక్షన్‌‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు కేరళ ఆర్టీఏ అధికారులు వీడియో కూడా తీశారు.