దేవాన్ష్‌ పేరుతో మంగళవారం తిరుమలలో అన్నదానం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 06:08 PM
 

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనుమడు, ఎమ్మెల్సీ లోకేశ్‌ కుమారుడైన దేవాన్ష్‌ పేరుతో మంగళవారం తిరుమలలో అన్నదానం నిర్వహించనున్నట్టు తితిదే జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.25లక్షల విరాళం పంపారు. ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చును భరించేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి ఈ మేరకు ఆ మొత్తాన్ని తితిదేకు పంపారు.