ఒక్కో ఎంపీటిసీకి రూ.20 ల‌క్ష‌లు ఇచ్చారు : జ‌గ‌న్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 05:37 PM
 

  అమ‌రావ‌తి :    కొద్ది సేప‌టిక్రితం ఏపి అసెంబ్లీలో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు భారీగా వైసీపి నేత‌లు  చేరుకుని ఆందోళ‌న‌లు చేయ‌డంతో స్పీక‌ర్ కోడెల రేప‌టికి వాయిదా వేసిన విష‌యం విధిత‌మే . అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ....క‌డ‌ప‌లో అన్ని స్ధానాలు గెలుస్తామంటున్న చంద్ర‌బాబు, త‌న పాల‌న బాగుంద‌ని బాబు అనుకుంటే పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి గెల‌వాల‌న్నారు. ప్ర‌జాస్వామ్యానికి వ్య‌తిరేకంగా సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. మాకు బ‌ల‌మున్న స్ధానాల్లో పోటీ పెట్టారు అని ఎద్దేవాచేశారు. ఒక్కో ఎంపీటీసీకి రూ 20 ల‌క్ష‌లు ఇచ్చి కొనుగోలు చేశార‌న్నారు. కిడ్నాప్‌లు చేసి ఓట్లు వేయించుకుని గెలిచార‌న్నారు. అదేదో గొప్ప అన్న‌ట్లు మళ్లీ స‌భ‌లో చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తామ‌న్నారు.