నాకు హైకమాండ్ తెలుగు ప్రజలే : సీఎం చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 02:28 PM
 

నాకు మాత్రం హైకమాండ్ తెలుగు ప్రజలేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, సోనియా గాంధీ పెట్టుకుని నాడు వైఎస్ గెలిచారని అన్నారు. అసెంబ్లీలో విపక్ష సభ్యులు హుందాగా ప్రవర్తించాలని ఆయన సూచించారు. విపక్ష సభ్యులు హుందాగా వ్యవహరిస్తే వారికి, సభకు గౌరవంగా ఉంటుందని హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎం హోదాలో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతలు కూడా ఇదే విధంగా అడ్డుపడేవారని నాటి విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు.