రజనీ ని దాటేసిన అమీర్ ఖాన్

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 12:13 PM
 

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ‘రోబో 2.0’ చిత్రం శాటిలైట్ రైట్స్ 110 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 500కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ‘2.0’ శాటిలైట్ రైట్స్ సగటు ప్రేక్షకుడిని ముక్కునవేలేసుకునేలా చేశాయి. ఇప్పుడు అంతకుమించి బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి.విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 120కోట్లకి అమ్ముడుపోయాయి. ఇందులో శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ కలిపి ఉన్నాయి. 1839లో వచ్చిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్’ నవల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. బ్రిటీష్ ఇండియా కాలంలో దారిదోపిడీలు, హత్యలు చేసే దుండగుల కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్‌తో కలసి నటించబోతున్నాడు అమీర్. ఈ చిత్రం 2018 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో.. శాటిలైట్ రైట్స్ విషయంలో అమీర్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘2.0’ని దాటిపోయాడు.