ప్రలోభాలతో విజయం సాధించారు: ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్‌రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 11:57 AM
 

అమరావతి: ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వాళ్లను అధికార బలంతో ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద మాట్లాడిన ఆయన.. టీడీపి అక్రమంగా సాధించిన ఈ విజయంతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలెవరూ అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో బేరీజు వేసుకొని ముందుకెళ్తామని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ధైర్యముంటే వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్యాంపులు పెట్టి పోలీసుల సహాయంతో నాయకులను ఇళ్ల నుంచి తీసుకెళ్లారని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. చెక్కులు ఇచ్చి మత పెద్దల వద్ద ప్రమాణాలు చేయించుకొని గెలిచారని, అసలు ఇది గెలుపే కాదని ఆయన విమర్శించారు.