బ్యాడ్మింటన్‌ క్రీడ అభివృద్ధికి కృషి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 12:22 AM
 

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ : షటిల్‌ బ్యాట్మింటన్‌ క్రీడను అభివృద్ధి చేసి సంస్ధ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని లార్‌‌డ కృష్ణ బ్యాట్మింటన్‌ అకాడమీ ఛైర్మన్‌, ప్రముఖ యువ పారిశ్రామికవేత్త శిద్ధా సుధీర్‌ కుమార్‌ అన్నారు. „మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లార్‌‌డ కృష్ణ బ్యాట్మింటన్‌ అకాడమీ ఛైర్మన్‌గా శిద్ధా సుధీర్‌ బాబును ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని మంగమూరు రోడ్డు సమీపంలో అకాడమీ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన పలు విషయాలు మాట్లాడారు. లార్‌‌డ కృష్ణ బ్యాట్మెంటన్‌ క్రీడను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి అకాడమీ ఛైర్మన్‌గా ఎన్నుకున్న ప్రతినిధులకు ఈ సదర్భంగా శిద్ధా సుధీర్‌ కృజ్క్షతలు తెలియజేశారు. భవిష్యత్తులో మీ నమ్మకాన్ని నిజం చేసే విధంగా సంస్ధ ఆశయాలను కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ మూడు సంవత్సరాల్లో అకాడమీ సాధించిన సేవలను గుర్తు చేసుకున్నారు. షటిల్‌ క్రీడను ఆడిందుకు సౌకర్యాలతో కూడిన ఇండోర్‌ స్టేడియాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. షటిల్‌ క్రీడ జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఏప్రిల్‌ 20 నుంచి 27వ తేదీ వరకు టీజీవి భరత్‌ ఆంధ్రా బ్యాట్మెంటన్‌ లీగ్‌ టోర్నమెంట్‌ కర్నూల్‌లో జరుగనుందని తెలిపారు. లీగ్‌ భాగస్వామిగా లార్‌‌డ కృష్ణ బ్యాట్మెంటన్‌ అకాడమీ ఉందన్నారు. అదే విధంగా ఏప్రిల్‌ 21వ తేదీన అంతర్జాతీయ స్ధాయి క్రీడాకారులు ఒంగోలులో ఆడటం అనేది గొప్ప పరిణామన్నారు. భవిష్యత్తులో కూడా షటిల్‌ బ్యాట్మెంటన్‌ క్రీడను జిల్లాలో అభివృద్ధి చేస్తూ సంస్ధ ఆశయాలు కొనసాగిస్తామని నూతన అకాడమీ ఛైర్మన్‌ శిద్ధా సుధీర్‌ పేర్కొన్నారు. అనంతరం సంస్ధ ప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు. 


ఈ కార్యక్రమంలో ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ అద్దంకి మురళీ కృష్ణ, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ హఫీజ్‌, జాయింట్‌ సెక్రటరీ బి శ్రీనివాసరావు, ట్రజరర్‌ శ్రీహరి, మెంబర్లు కుమార్‌, సత్య తదితరులు పాల్గొన్నారు.