నిరుద్యోగ భృతి రూ.2వేలు-చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Thu, Jan 31, 2019, 08:06 PM
 

నిరుద్యోగ భృతి రూ. 1000 నుంచి రూ. 2000 పెంచుతూ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలులో సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతువు పెన్షన్‌ను రెట్టింపు చేశారు. మహిళలకు పసుపు కుంకుమ-పేరుతో రూ.10 వేలు ఇస్తున్నారు. రైతులకు నగదు బదిలీ చేస్తున్నారు. ఇలాంటి పథకాలతో, సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూల ఓటుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ భృతి పెంచుతామని టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగ భృతి రూ. 1000 నుంచి రూ. 2000 వరకు పెంచారు. నిరుద్యోగ భృతి పెంపు అంశాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లోపే నిరుద్యోగ భృతి పెంపును అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.