మంత్రి శిద్ధాతో చైనా బృందం భేటీ

  Written by : Suryaa Desk Updated: Sun, Mar 19, 2017, 01:21 AM
 

  -దొనకొండలో వైట్‌స్టోర్‌ బృందం పెట్టుబడులు


  -వచ్చే రెండేళ్లలో రూ.18వేల కోట్లు పెట్టుబడులు  త్వరలో ముఖ్యమంత్రితో భేటీ 


  -చైనా బృందాన్ని ఘనంగా సన్మానించిన మంత్రి శిద్ధా


  ఒంగోలు, సూర్యప్రతినిధి : పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దొన కొండలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన  ఉక్రయిన్‌కు చెందిన  టైటాన్‌ ఏవియోషన్‌ ఏరోస్పేస్‌ కంపెనీకి చెందిన వైట్‌స్టోన్‌‌స బృందం శనివారం సాయంత్రం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి విదేశీ బృందానికి పుష్పగుచ్ఛం అందజేసి సాగరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు విషయాల పై చర్చించారు. వచ్చే రెండేళ్లలో దొనకొండలో రూ.1800 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు కొచ్చారు.  ఈ సంస్థ హెలికాప్టర్‌ విభాగాలు, విమాన విభాగాలు, సర్వీసింగ్‌ కార్యకలాపాలు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అంశం పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కూడా త్వరలో భేటీ అవుతామన్నారు. 


    ఈ సందర్భంగా మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ దొనకొండలో పరిశ్రమలు పెట్టేందుకు విదేశీ కంపెనీలు మందు కు వస్తున్నాయన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు. దొనకొండలో పరిశ్రమలు పెట్టడం ద్వారా జిల్లా మరింత అభివృద్ధి చెందు తుందన్నారు. అంతే కాకుండా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం మంత్రి విదేశీ బృంద సభ్యులను ఘనంగా సన్మానించారు. మంత్రిని కలిసిన వారిలో చైనా బృందం సంస్థ సిఎండి గిరికుమార్‌, వైస్‌ చైర్మెన్‌ చంద్రశేఖర్‌, వైట్‌ స్టోన్‌ వెంచర్‌ క్లాపిటల్‌ డైరెక్టర్‌ ఛాంగ్‌చూన్‌ ఫో తదితరులు  ఉన్నారు.