ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాహ్య సహాయంతో నడుస్తున్న ప్రాజెక్టుల వేగం పెంచండి: ముఖ్యమంత్రి చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2017, 11:31 AM

బాహ్య ఆర్ధిక  సహాయంతో కొనసాగుతున్న ప్రాజెక్టుల (Externally Aided Projects) పనులలో వేగం పెంచుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. శుక్రవారం రాత్రి ఆయన విదేశీ, రాష్ట్రేతర సంస్థల నుంచి వచ్చే రుణ సహాయంతో రాష్ట్రంలో నడుస్తున్న ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.  రాష్ట్రం విదేశాల నుంచి తీసుకునే రుణాలకు కేంద్రం హామీగా ఉంటుందన్నారు.   ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం  బాహ్య సహాయంతో  8 ప్రాజెక్టులు నడుస్తుండగా వీటిలో రాష్ట్ర వాటా రూ.4009 కోట్లు కేంద్ర వాటా/లేదా కేంద్రం సమకూరుస్తున్న రుణవాటా రూ 7,141 గా ఉంది. మొత్తం రూ.1150 కోట్లు.ఎనిమిది ప్రాజెక్టులలో  6 ప్రాజెక్టులను కేంద్రం ధృవీకరించిందని, కేంద్రం అనుమతించిన ఈ ప్రాజెక్టులలో రాష్ట్ర వాటా రూ.3,796 కోట్లు ఉంటే కేంద్రవాటా రూ 9,573 కోట్లు కాగా మొత్తం రూ.13,399.  కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రాజెక్టుల సంఖ్య 3. రాష్ట్రవాటా రూ. 3,037 కోట్లు. కేంద్రవాటా రూ.7086. మొత్తం రూ.10,123 కోట్లు. కేంద్రానికి సమర్పించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు 4. వీటిలో రాష్ట్ట వాటా రూ.4,390 కోట్లు. కేంద్ర వాటా రూ. 10,224 కోట్లు. మొత్తం రూ.14,634 కోట్లు. 


షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్: 4. రాష్ట్ర వాటా రూ. 4474 కోట్లు. కేంద్రవాటా రూ. 11,204 కోట్లు. మొత్తం రూ 15,678 కోట్లు.


  మొత్తం విదేశీ సహాయం లేదా బయటి నుంచి పొందుతున్న ప్రాజెక్టుల సంఖ్య 25. రాష్ట్ర వాటా రూ 19,706 కోట్లు. కేంద్ర వాటా రూ. 45,248 కోట్లు. మొత్తం రూ. 66954 కోట్లు.  అమరావతి అభివద్ధి, రహదారులు, భవనాలు, విద్యుత్తు, పారిశుధ్యం, జలవనరులు, గ్రామీణాభివద్ధి, పారిశ్రామిక కారిడార్లు తదితర శాఖల్లో విదేశీ రుణాలతో సాగుతున్న ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే కొత్తగా రుణాలతో ప్రతిపాదించే పథకాలకు సవివర నివేదికలు సమర్పించాలని ఆయన కోరారు.  నాబార్డు నిధులను సద్వినియోగం చేయాలన్నారు.  సున్నా శాతం నిధులున్న విభాగాల్లో చేపట్టాల్సిన పనులను కన్వర్జెన్స్‌తో పూర్తిచేయాలని చంద్రబాబు కోరారు.  సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ అజేయ కల్లాం, ఉన్నతాధికారులు దినేష్ కుమార్, సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి  జి. సాయి కుమార్, సీఎంఓ సహాయ కార్యదర్శి  ఎ.వి రాజమౌళి, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఏడాదిలోగా గ్రామీణ వీధుల్లో ఎల్ ఈడీ ట్యూబ్ లైట్లు


 -ముఖ్యమంత్రి చంద్రబాబు


  ఏడాదిలోగా ప్రతి గ్రామంలో ఎల్ఈడీ ట్యూబ్ లైట్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి  అమరావతిలో ఎల్ ఈడీ ట్యూబ్ లైట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని సీఎంఓ నుంచి ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని మందడం,వెలగపూడి  గ్రామస్తులకు ముఖ్యమంత్రి ఎల్ ఈడీ ట్యూబ్ లైట్లను పంపిణీ చేశారు.  ప్రతి ఇంటిలో బల్బు, ఫ్యాను, ఎల్ ఈడీ ట్యూబ్ లైటు ఉంచాలని కోరారు. అన్ని పంచాయతీలతో విద్యుత్ ఆదాతో కూడిన ఎల్ ఈడీ ట్యూబ్ లైట్లనుఅమర్చాలని ముఖ్యమంత్రి కోరారు. పంచాయతీలు ఎల్ ఈడీ బల్బులు వినియోగించి 40% విద్యుత్తు ఆదా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామాలలో పూర్తిస్థాయి ఎల్ ఈడీ బల్బులను అమర్చేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించుకోవాలన్నారు. ఇంధర సామర్ధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు.  ఎల్ ఈడీ బల్బుల వాడకంలో ప్రపంచంలోనే మనం ముందు నిలిచామని సీఎం తెలిపారు. భారత్ లో విద్యుత్ పొదుపులో, నాణ్యమైన విద్యుత్ సరఫరాలో నెంబర్, విద్యుత్తు పంపిణీ నష్టాలు లేని రాష్ట్రంగా మన రాష్ట్రం అనేక రికార్డులు సృష్టించిందని చంద్రబాబు ప్రశంసించారు.  ఇంధన సామర్ధ్యం లేని 15 లక్షల వ్యవసాయ పంపుసెట్లను ఉచితంగా మార్పు చేసే కార్యక్రమాన్ని దశలవారీగా చేపట్టిన అంశాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో కోటిమంది విద్యుత్తు వినియోగదార్లకు 2 కోట్ల ఎల్ ఈడీ విద్యుత్తు దీపాలను పంపిణీచేశామన్నారు.  నాడు ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది, దేశంలో తొలిసారి విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది మనమేనని చంద్రబాబు గుర్తు చేశారు. విభజన సమయంలో నవ్యాంధ్రలో 22.5 మిలియన్ యూనిటల విద్యుత్తు లోటు ఉండేదని, నిరంతర విద్యత్తు పథకంలో రెండునెలలలోనే అధిగమించి, ఏడాదిలోనే విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దామని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. భవానీ ప్రసాద్, ఎండీ సౌరభ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ దినేష్ కుమార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com