సీటు ఇవ్వక పోతే.... రూ.10 వేల పరిహారం ఆర్టీసీ సీటు ఇవ్వలేదని వృద్ధుడి ఫిర్యాదు

  Written by : Suryaa Desk Updated: Sat, Mar 18, 2017, 11:22 AM
 

హైదరాబాద్‌: బస్సులో సీటు దొరక్కపోవడంపై వృద్ధుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించిన సంఘటన ఇది. రిజర్వేషన్‌ ప్రకారం తమకు కేటాయించిన సీటు ఎదురుగా ఉన్నప్పటికీ కూర్చునే పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) కల్పించలేదని సంగారెడ్డి ప్రశాంత్‌నగర్‌కు చెందిన న్యాయవాది నాగేందర్‌ (68) కోర్టు ముందు వాదన వినిపించారు. ఆ మేరకు రూ.20ల టికెట్టు తీసుకున్న వృద్ధుడిని కిలోమీటర్ల మేర నిల్చొని ప్రయాణించేలా చేసిన ఆర్టీసీ రూ.10వేల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఆర్టీసీ వృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సేవల్లో లోపాలున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని వెల్లడించింది.