ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Mar 18, 2017, 01:34 AM
 

అమరావతి సూర్య ప్రత్యేక ప్రతినిధి  ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు జిల్లాలో మొత్తం 1083 ఓట్లకు గాను 1,076 ఓట్లు పోలయ్యాయి. కడపలో 841 ఓట్లకు 838, నెల్లూరులో 852కిగాను 849 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరులో 5, కడప, కర్నూలులో మూడేసి చోట్ల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా అన్ని చోట్లా ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. ఈ నెల 20న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.


ప్రశాంతంగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రశాంతంగా కొనసా గింది. నెల్లూరు జిల్లాలో 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మందకొడిగా కొన సాగింది. నెల్లూరు, కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. జిల్లావ్యాప్తంగా 852 ఓట్లు ఉండగా అత్యధికంగా నెల్లూరులో 261 ఓట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున వాకాటి నారాయణరెడ్డి, వెకాపా తరపున ఆనం విజయకుమార్‌రెడ్డి పోటీలో ఉన్నారు.


నిఘా నీడలో కడపలో పోలింగ్‌: కడపలో పోలీసుల నిఘా నీడలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. కడప, రాజంపేట, జమ్మలమడుగులో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల ప్రాంతా న్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి ఎలాంటి వస్తువులు అనుమతించడం లేదు. జిల్లాల్లో మొత్తం 840 ఓటర్లు ఉన్నారు. టీడీపీ తరపున బీటెక్‌ రవి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున వై.ఎస్‌ వివేకానం దరెడ్డి బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కర్నూలులో ప్రశాంతంగా కొనసాగింది. కర్నూలు, నంద్యాల, ఆదోని పట్టణాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. తెలుగుదేశం పార్టీ తరపున శిల్పా చక్రపాణిరెడ్డి,  వైకాపా నుంచి గౌరు వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. ఇరు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. జిల్లాలో 1084 ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.


కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో 93.40 శాతం పోలింగ్‌: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ 93.40 శాతం పూర్తయ్యింది. రాజంపేటలో 228 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటేశారని అధికారులు తెలిపారు.  శాసనమండలి ఎన్నికను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీరియ్‌స్‌గా తీసుకోవడంతో ఈ ఎన్నికలు ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోలింగ్‌ కేంద్రాల చుట్టూ భారీ పోలీసు బలగాలు, పోలింగ్‌ కేంద్రాలలో, బయట సీసీ కెమెరాలు, వెబ్‌ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలు, బాడీవోర్న్‌  కెమెరాల నిఘా, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ తమ వద్ద 450 మంది స్థానిక ప్రతినిధులు వున్నారని లెక్కలు తేల్చుతుండగా, గెలుపు తమదేనని వందఓట్లకు పైగా మెజా రిటీతో గెలుపు సాధిస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు.


ఖాకీ నీడలో కడప.. 144 సెక్షన్‌ అమలు: కడప,  పోలింగ్‌ కేంద్రాల చుట్టూ భారీ పోలీసు బలగాలు, పోలింగ్‌ కేంద్రాలలో, బయట సీసీ కెమెరాలు, వెబ్‌ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలు, బాడీవోర్న్‌ కెమెరాల నిఘా, ఎక్కడ ఎలాంటి అవాం ఛనీయ సంఘటన, దౌర్జన్యకర సంఘటనలకు ప్రయత్నించినా కఠిన చర్యలు. శుక్రవారం జరగబోయే స్థానిక శాసనమండలి పోలింగ్‌ కేంద్రాలపై జిల్లా ఎన్నిక ల యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఇలా పటిష్ట ఏర్పాట్లు చేసింది. జిల్లాలో జరిగే స్థానిక శాసనమండలి ఎన్నికలు టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మార డంతో ఉత్కంఠ నెలకొంది. ఈ పోరులో గెలుపునకోసం ఎవరి వ్యూహాల్లో వారు వున్నారు. ఎక్కడికక్కడ పావులు కదుపుతున్నారు. స్థానిక ప్రతినిధులైన ఓటర్ల మద్దతు కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పోలింగ్‌కు భారీ బందోబస్తు, ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఈ మేరకు అవసర మైన అన్ని రకాల చర్యలు ఎన్నికల యంత్రాంగం, పోలీసులు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా వెంటనే అప్రమత్తమయ్యే విధంగా సిబ్బందికి, పోలీసు అధికారులకు ఉన్నతాధికారులు సూచనలు చేశారు.


పోలీసుల భారీ బందోబస్తు: జిల్లాలో మూడు పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్‌ కేంద్రానికి వెయ్యి మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. ఇప్పటివరకు ఎప్పుడూ, ఎక్కడా ఒక పోలింగ్‌ కేంద్రం వద్ద ఇంతమంది పోలీసులను బందోబస్తు పెట్టిన దాఖలాలు లేవు. వీరే కాకుండా వందల సంఖ్యలో పోలీసులు, అధికారులు మొబైల్‌పార్టీలను, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ పోలింగ్‌ విధులు నిర్వహించారు. జిల్లాలో పోలింగ్‌ జరుగిన ప్రాంతాల్లో 75 పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. అన్ని సబ్‌డివిజనలో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్‌కేంద్రాల వద్ద నాన్‌ ఎనలైజర్‌ డిటెక్టర్స్‌ను ఉపయోగించారు. పోలింగ్‌ కేంద్రం ఆవరణ చుట్టూ ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ఓటరు లోపలికి వెళ్లేందుకు మూడు వలయాల్లో చెకింగ్‌ నిర్వహించారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో, పరిసరాల్లో ఎవరూ అవాంఛనీయ సంఘటనలకు ప్రయత్నించ కుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. 30 యాక్టు, 144 సెక్షన్‌ అమలులో ఉంచారు. గతంలో ఎప్పుడూ ఏ ఎన్నికల్లో ఉపయోగించని బాడీవోర్న్‌ కెమెరా లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, వెబ్‌ కెమెరాలు, వీడియో కెమెరా లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జిల్లాలో మూడు పోలింగ్‌ కేంద్రాల్లో 840 మంది ఓటర్లు ఉంటే సుమారు 4 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం చూస్తే కడప స్థానిక శాసనమండలి పోలింగ్‌ ఏ స్థాయిలో జరిగిందో అర్థం కావడంతో ముందుగానే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కడపలోనే ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ రమణకుమార్‌లు మకాం వేశారు.  జిల్లా ఎస్పీ జిల్లాలో జరుగుతున్న ఎన్నికలపై తగినంత సమాచారాన్ని సేకరించి శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 700 మంది రౌడీషీటర్లు, ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడతారనుకునే అనుమానితులను బైండోవర్‌ చేశారు.