ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఫోర్త్‌ జనరేషన్‌ టెక్నాలజీ పార్కు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2017, 01:24 AM

  అమరావతి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటులో సహకరించేందుకు మలేసి యా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తొలుత అమరావతిలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్‌ జనరేషన్‌ టెక్నా లజీ పార్కును ఏర్పాటుచేయనున్నారు. ఈ పార్కులో తొలి దశలో 30, 40 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.350 కోట్ల పెట్టు బడులు రానున్నాయి. ఏప్రిల్‌ నెలలో మలేసియా ప్రధానమంత్రి భారత్‌ పర్యటనలో భాగంగా ఇరుదేశాల ప్రధానమత్రుల సమక్షం లో దీనికి సంబంధించిన జీటూజీ, లేదా బీటూబీ ఒప్పందాలు జరగను న్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాల యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన మలేసియన్‌ బృందం దీనిపై చర్చలు జరిపింది. 


  మలేసియన్‌ ఇండస్ట్రీ-గవర్నమెంట్‌ గ్రూప్‌ ఫర్‌ హై టెక్నాలజీ (మైట్‌) ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఫెసిలిటేటర్‌గా వ్యవహరి స్తోంది. మలేసియా ప్రభుత్వానికి చెందిన ‘మైట్‌’ వరిగడ్డి, ఇతర పంటల వ్యర్థాల నుంచి తయారుచేసే ‘బయో డీగ్రేడబుల్స్‌’ సాంకే తికతను ప్రోత్సహిస్తోంది. ‘ఫ్రీ ద సీడ్‌’ అనే మలేసియన్‌ సంస్థ ఈ సాంకేతికతకు పేటెంట్‌ కలిగివుంది. 


ఫోర్త్‌ జనరేషన్‌ టెక్నాలజీ పార్కులో భాగంగా ‘మైట్‌’ తొలుత ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ రీసైకిలింగ్‌ ప్లేట్లు, ఇతర ప్యాకేజింగ్‌ సామాగ్రిని తయారుచేసే పరిశ్రమను ఏర్పాటుచేస్తా రు. ఈ రీసైకిలింగ్‌ ప్లేట్లు ప్రస్తుతం మనం వివాహాలు, ఇతర వేడుకల్లో భోజనం చేసేందుకు ఉపయోగించే పేపర్‌ ప్లేట్ల మాదిరి గానే వుంటాయి. ప్లాస్టిక్‌ ప్లేట్లు పర్యావరణానికి హాని చేస్తున్నం దున పరిశోధన చేసి వాటి స్థానంలో బయో డీగ్రేడబుల్స్‌ను తయారుచేసే  సాంకేతికతను కనుగొన్నామని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా ఉత్పత్తులను ముఖ్య మంత్రికి ప్రదర్శించారు. ప్యా ేజింగ్‌, ఫుడ్‌ ప్లేట్లు మాత్రమే కాకుం డా వైద్య అవసరాలకు ఉపయోగించే సామాగ్రిని కూడా రూపొం దిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రులలో సర్జరీ, మెడికల్‌ అవస రాలకు ప్రస్తుతం ఉపయోగించే స్టీల్‌ ప్లేట్లను శుభ్రం చేయడానికి ఎప్పటికప్పుడు నీటిని ఉపయో గించాల్సి వుంటుందని, వాటికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే బయో డీగ్రేడబుల్స్‌తో ఆ మేరకు ఖర్చు తగ్గిపోతుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదా వరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో వరి ప్రధానంగా పండించే రైతులకు ఈ యూనిట్‌ ఏర్పాటు వల్ల ఎకరానికి ఏటా మరో రూ.50 వేల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివ రించారు. వరి గడ్డి, చెరకు పిప్పి, జొన్న, మొక్కజొన్న తరహా పంటలకు చెందిన రైతులందరూ వ్యర్దాలను సరఫరా చేయడం ద్వారా లబ్ధి పొందగలుగుతారని తెలిపారు. తొలిదశలో వంద ఎక రాలలో 30, 40 పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, ఇవన్నీ చిన్న, మధ్య తరహా యూనిట్లేనని మలేసియన్‌ బ ందం తెలిపింది. ఇవన్నీ పర్యావరణ హితమైన ఉత్పత్తులను తయారుచేసేవేనని అన్నారు. ఇవి ఒకసారి ఉపయోగించి విసిరేసి పారేసినా ఆరు నెలల్లో ఇవి ఎరువుగా మారి పూర్తిగా భూమిలో కలిసిపోతాయని చెప్పారు. ఈ తరహా సాంకేతికతను ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసింది తామేనని తెలిపారు. ఈ ఉత్పత్తులకు యూరప్‌లో 10 బిలియన్‌ డాలర్ల మేరకు మార్కెట్‌ వుంటే, అమెరి కాలో 300 బిలియన్‌ డాలర్ల వరకు వున్నదని వివరించారు. తొలుత ఏపీలో బయో డీగ్రేడబుల్స్‌ పరిశ్రమలను నెలకొల్పి ఇక్కడి నుంచి భారత్‌ మొత్తానికి విస్తారించాలన్నదే ప్రణాళికగా చెప్పారు.  మలేసియాలో దక్షిణ భారత దేశ వ్యవహారాల ప్రత్యేక దూత డాక్టర్‌ ఎస్‌. శామి వెల్లు తొలుత ఈ బ ందాన్ని ముఖ్య మంత్రికి పరిచయం చేశారు. శామి వెల్లు తనకు మంచి మి్త్రుడని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా చెప్పారు. మలేసియా విధానాలు తనకెప్పుడూ సూేర్తినిస్తాయని అన్నారు. గతంలో తను ముఖ్య మంత్రిగా వున్నప్పుడు మలేసియా పర్యటనకు వెళ్లి అక్కడ ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. అక్కడ సముద్ర తీరం వెంబడి నిర్మించిన రహదారిని చూసి ఇక్కడ కూడా అలాంటి మౌలిక వసతులు కల్పించాలని  అప్పుడు మన ప్రధానిగా వున్న వాజ్‌పేయిపై వత్తిడి చేశానని గుర్తుచేశారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు తమ రాష్ర్టంలో తీరం వెంబడి  రోడ్డును నిర్మించాలన్న ఆలోచనకు ఆనాడే బీజం పడిందన్నారు. మలేసియా మోడల్‌గా హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో టౌన్‌షిప్‌ కూడా నిర్మించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నవ నిర్మాణంలో భాగస్వా ములవుతామని డాక్టర్‌ శామి వెల్లు చెప్పారు. కృష్ణపట్నంలో గ్యాస్‌ టెర్మినల్‌ ఏర్పాటుపై చర్చించేందుకు శామి వెల్లు గతంలో ఒక బృందాన్ని తీసుకుని వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. నెల్లూరు జిల్లా క ష్ణపట్నంలో నిర్మాణమవుతున్న రీగ్యాసిఫికేషన్‌ టెర్మినల్‌, స్టోరేజీ టెర్మినల్‌ పురోగతిపై మలేసియన్‌ సంస్థ ప్రతినిధి ముఖ్య మంత్రికి వివరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రాజమౌళి, ఎల్‌ఈపీఎల్‌ సీఈవో ఎస్‌డీవీ కష్ణకుమార్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com