ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పని వేళల్లో మార్పులు

  Written by : Suryaa Desk Updated: Wed, Jan 23, 2019, 07:03 PM
 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పని వేళల్లో మార్పులు చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పని వేళలు మార్పు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.15 నుండి సాయంత్రం 4.15 వరకు పనిచేస్తుంది. జనవరి 28 నుండి నూతన పని వేళలు అమల్లో వస్తాయని ఏపీ హైకోర్ట్ రిజిస్టర్ జనరల్ తెలిపారు.