రెండో రౌండ్లో సానియా జోడీ

  Written by : Suryaa Desk Updated: Fri, Mar 10, 2017, 06:34 PM
 

ఇండియన్‌వెల్స్‌: బీఎన్‌పీ పరిబాస్‌ ఓపెన్‌-2017 టోర్నీలో భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. మహిళల డబుల్స్‌ విభాగంలో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి బార్బోవ స్ట్రైకోవాతో జతకట్టిన సానియా తొలి రౌండ్లో జూలియా(జర్మనీ)- జెలీనా(లాట్వియా) జోడీపై విజయం సాధిచింది.


సుమారు గంటా 15నిమిషాల పాటు సాగిన తొలి రౌండ్లో నాలుగో సీడ్‌ సానియా జోడీ ప్రత్యర్థిపై 6-3, 6-4తేడాతో విజయం సాధించింది. సానియా జోడీ 8 బ్రేక్‌ పాయింట్లు సాధించింది. రెండో రౌండ్లో ఈ జోడీ సారా ఎరానీ(ఇటలీ)- రోసోల్కా(పోలాండ్‌)తో తలపడనుంది.