కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిన దత్తాత్రేయ

  Written by : Suryaa Desk Updated: Fri, Mar 10, 2017, 05:44 PM
 

ఢిల్లీ : కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ను కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్బంగా ప్రతి గ్రామానికి తాగునీరు, క్లస్టర్ డెవలప్‌మెంట్, గ్రామీణ సడక్ యోజన, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన వంటి పథకాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అలాగే తాగునీరు సౌకర్యం లేని గ్రామాలకు మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రిని దత్తాత్రేయ కోరారు. అలాగే నేషనల్ అర్బన్ డెవలప్‌మెంట్ పథకం కింద తెలంగాణలోని 4 పట్టణాలు ఎంపిక చేశామని, డిజిటల్ అక్షరాస్యత పథకంలో హైదరాబాద్‌తోపాటు నేను దత్తత తీసుకున్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరానని దత్తాత్రేయ తెలిపారు.