ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడగంళ్ల వాన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 02:10 AM

-బాధితులను పరిమార్శించిన రాష్ట్ర బిజెపి నాయకులు
-రాష్ర్ట భాజాపా అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, అధికార ప్రతినిధి రఘునందన్‌రావ్‌
-ఏటా లక్ష 30 కోట్ల రాష్ట్ర బడ్టెట్‌ పెడుతున్నా రైతుల రుణ మాఫీ తీరదా?
-వేసవి అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై బిజెపి పోరాడుతుంది
-రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన చేయించుకోవాలి

 మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, మేజర్‌న్యూస్‌ః ప్రకృతి వైపరిత్యం వల్ల ఆకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులను, భాధితులను రాష్ర్ట భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, రాష్ర్ట అధికార ప్రతినిధి రఘునందన్‌రావులు పరామర్శించింది. మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన ఆకాల వడగండ్ల వర్షానికి ద్రాక్ష, మామిడి తోటలు పూర్తిగా నేలరాలి లక్షల రూపాయలు నష్టపోగా పలు ఇండ్ల పైకప్పుల రేకులకు చిల్లులు పడ్డాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర భాజాపా నాయకులు బుధవారం కీసర మండలంలోని భోగారం,కీసర దాయర, రాంపల్లిదాయర, గోధుమకుంట గ్రామాల్లో పర్యటించి ద్రాక్ష, మామిడి, కాకర, టమాట తోటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర భాజాపా అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరిత్యాల వల్ల వాటిల్లే నష్టం నుండి రైతులను ఆదుకునేందుకు ఉదారంగా నష్ట పరిహారం పెంచింది కాని రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో రైతులకు ప్రకటించిన రుణమాఫి చేయకపోవడంతో నేడు రైతులకు అది అందకుండా పోతుందని ఆవేధన వ్యక్తం చేశారు.  కీసర మండలంలో 300 పైచిలుకు వరీ, 40 ఎకరాల ద్రాక్ష, 25 ఎకరాల్లో మామిడి, 20 ఎకరాల్లో కూరగాయల సాగు, పలుచోట్ల ఫాలిహౌజ్‌లు మంగళవారం సాయంత్రం ఆ కాలంగా కురిసిన భారీ వడగండ్ల వర్షానికి రైతులు సుమారు 2కోట్ల వరకు నష్టపోయారని లక్ష్మణ్‌ అన్నారు. కీసర మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు వేసుకున్న పంటలు భారీగా దెబ్బతిన్నాయని ఇందుకు కీసరలోని ద్రాక్ష పంట రైతు పన్నాల బుచ్చిరెడ్డి తన ఆరు ఎకరాల పోలంలో 20 లక్షల ఆప్పుతో వేసుకున్న పంట నష్టపోయాడంటే జిల్లాలో కురిసిన వడ గండ్ల వాన తాకిడికి ఎంతమేర నష్ట వాటిలిందో ఆర్ధం చేసుకోవచ్చారు. రాష్ర్ట ప్రభు త్వం వాయిదాల పద్దతిలో  సకాలంలో రుణమాఫి చేయకపోవడంతో రైతులకు ఏమాత్రం మేలు జరుగడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటు వటి ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజనకు సైతం రాష్ట్రంలోని రైతులు నోచుకోవడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఏకకాలంలో రుణమాఫీ చెల్లించి ఉంటే రైతులు తిరిగి రుణాలు పొందే అవకాశాలు ఉండేటిని  అని తద్వారా రైతులకు రుణంతోపాటు పంట భీమా కూడా తీసుకునే అవకాశం ఉండేదని అన్నారు. అలా జరిగి ఉంటే ఇప్పుడు జిల్లాల్లో సంబంవించిన ఈ విపత్తుకు  రైతులకు పంట భీమా ద్వారా నష్ట పరిహారం అందేదని తద్వారా రైతులు అప్పుల ఊబిలో కురుకుపోయే అవకాశం ఉండేది కాదని ఘాటుగా విమర్శించారు. మేడ్చల్‌ జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు గురై నష్టపోయిన రైతులను రాష్ర్ట ప్రభుత్వం వెంటనే వారి రుణాలను మాఫీచేసి వారికి ఉపశమనం కలిగేలా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతి యేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 130కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న దేశానికి అన్నం పెడుతున్న రైతుల రుణమాఫీ చేయలేని పరిస్థితిలో నేడు రాష్ర్ట ప్రభుత్వం తయ్యారైందని దూయబట్టారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేటికి సమఖ్య రాష్ట్రంలో మాదిరిగానే రైతుల బతుకులు ఉన్నాయని ఏమి మారలేదని ప్రభుత్వం నిర్లక్ష్యం పుణ్యామాన్ని రైతులు రోజురోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని ఆవేధన వ్యక్తం వేశారు. ఆకాల వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చే యడంతో పాటు ఇండ్లు కోల్పొయిన భాధితులకు రెండు పడకల గదుల పథకంలో అవకాశం కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ విష యంపై నెల 10న జరుగనున్న వేసవికాలం సమావేశంలో భాజాపా అధ్వర్యం లో రాష్ర్టంతో గొంతేత్తి పోరాడుతామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర భాజాపా ఉపాధ్యాక్షులు డాక్టర్‌ ఎస్‌.మాల్లారెడ్డి, కొంపల్లి మోహన్‌రెడ్డి, రాష్ట్ర కిసాన్‌మోర్చా అధ్యక్షులు గోలి మధుసుధన్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా భాజాపా అధ్యక్షులు మాదవరం కాంతరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునిగంటి సురేశ్‌, జిల్లా ప్రధాన కార్యదƒ ర్శి కందాడి సత్తిరెడ్డి, కిసాన్‌ మోర్చా మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు తరిగోప్పుల బాల్‌రాజ్‌, జిల్లా నాయకులు సింగిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లాల తిరుమల రెడ్డి, కీసర మండల భాజాపా అధ్యక్షులు ఎనుగు రాజిరెడ్డి, మండల యువ… మోర్చా అధ్యక్షులు నల్ల వెంకటరెడ్డిలతోపాటు వ్యవసాయాధికారి, ఉధ్యానవనాధి కారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com