ఐదు ల‌క్ష‌ల మందితో శాంతి ర్యాలీ:అళ‌గిరి

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 20, 2018, 05:18 PM
 

త‌మిళ‌నాడు : డీఎంకే పార్టీ పగ్గాల కోసం అన్న అళగిరి, తమ్ముడు స్టాలిన్ ల మధ్య వైరం మరింత ముదిరింది. తాజాగా తన బలాన్ని నిరూపించుకునేందుకు చెన్నై లో సెప్టెంబర్ ఐదున దాదాపు లక్ష మందితో శాంతి ర్యాలీ నిర్వహిస్తానని అళగిరి ప్రకటించారు. ఇటీవల కరుణానిధి చనిపోయిన సందర్భంగా అళగిరి మాట్లాడుతూ.. స్టాలిన్ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు మాత్రమేనని, చీఫ్ కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే బలహీనంగా తయారయిందని దుయ్యబట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ రాబోయే రెండు రోజుల్లో తన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.