రాజమహేంద్రవరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 20, 2018, 03:40 PM
 

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మధ్యాహ్నానికి గోదావరి నీటిమట్టం 17 అడుగులకు చేరడంతో పోలీసులు ప్రమాద హెచ్చరికలను సూచిస్తూ బోర్డు పెట్టారు. నదిలో ఎటువంటి స్నానాలు ఆచరించరాదని పేర్కొన్నారు. నదిలో చేపల వేటను నిషేధించారు. నదికి వరద తాకిడి మరింత పెరిగితే సమీప ప్రాంతాల్లోని గ్రామాలకు వరద ముప్పుతో పాటు రైల్వే బ్రిడ్జిపైకి కూడా నీరు చేరే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.