అనంతపురం జిల్లా పుట్టపర్తి లో ఏనుములపల్లి గ్రామస్తులు సహాయార్థం 50 బస్తాల బియ్యాన్ని సేకరించారు. అలాగే నిత్యావసర సరుకులైన ఆహార ధాన్యాలు, సబ్బులు, కిట్లు, దుస్తులను అందజేస్తున్నారు. పొరుగు రాష్ట్రాన్ని ఆదుకునేందుకు అన్నదాత నేనుసైతం అంటూ ముందుకొస్తున్నాడు.