ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హార్దిక్ పటేల్ అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 19, 2018, 04:24 PM

నికోల్ గ్రౌండ్ లో పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమకారుడు చేపట్టనున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పటీదార్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని, రైతు సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో ఒకరోజు నిరాహార దీక్షలో పాల్గొనేందుకు నికోల్ వెళ్తున్న హార్దిక్ పటేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హార్దిక్ పటేల్ తో పాటు ఇతర పటీదార్ నేతలను అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 25 నుంచి నికోల్ గ్రౌండ్‌లో నిరవధిక నిరాహార దీక్షకు అనుమతి కోరినప్పటికీ పోలీసులు నిరాకరించారని, నికోల్ గ్రౌండ్‌ను చివరి నిమిషంలో పార్కింగ్ గ్రౌండ్‌గా మర్చేశారని నిన్న హార్దిక్ పటేల్ ఆరోపించారు. నికోల్ గ్రౌండ్ లో నిలిపి ఉంచిన కారులోనే ఆదివారంనాడు నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితికి చెందిన 501 మంది యువకులు నిరసన తెలుపుతామని అన్నారు. ఈ నేపథ్యంలో నిరాహార దీక్షకు నికోల్ బయలుదేరిన హార్దిక్ సహా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com