ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో పలు రైళ్లను రద్దు చేసిన సదరన్ రైల్వే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 19, 2018, 01:05 PM

తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు సదరన్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని రైళ్ల రాకపోకల సమయాలను మార్చామని, మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశామని అధికారులు తెలిపారు. పాల్‌ఘట్ డివిజన్ పరిధిలోని షోరనూర్-కోజికోడ్ రైలు మార్గం, ట్రివేండ్రం డివిజన్ పరిధిలోని ఎర్నాకులం-కొట్టాయం-కయంకులం సెక్షన్‌లో రైలు మార్గాలను మూసేశామని రైల్వే అధికారులు తెలిపారు.


క్యాన్సిలైన రైళ్ల వివరాలు


కేఎస్‌ఆర్ బెంగళూరు - కొచువెలి ఎక్స్‌ప్రెస్ (19 ఆగస్టు) (ట్రెయిన్ నం.12257)


ట్రివేండ్రం-చెన్నై మెయిల్ (19 ఆగస్టు) (ట్రెయిన్ నం.12624) 


కన్యాకుమారి-కేఎస్‌ఆర్ బెంగళూరు ఐల్యాండ్ ఎక్స్‌ప్రెస్ (19 ఆగస్టు) (ట్రెయిన్ నం.16525)


ధన్‌బాద్-అలెప్పి ఎక్స్‌ప్రెస్ (19 ఆగస్టు) (ట్రెయిన్ నం.13351)


ట్రెయిన్ నం.17229 ట్రివేండ్రం సెంట్రల్-హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ రైలును పాక్షికంగా రద్దు చేశారు. ట్రివేండ్రం సెంట్రల్-తిరుపతి మధ్య ఈ రైలు నడవదని రైల్వే అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com