హర్యానాలోని ఓ ఆలయ పూజారి సుమారు 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. మహిళలను రేప్ చేస్తూ తీసిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఫతేహాబాద్లో అతన్ని అరెస్టు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉంటున్న ఆయన.. మహిళలను లొంగదీసుకున్న వీడియోలు ఇటీవల ఆన్లైన్లో దర్శనం ఇచ్చాయి. దీంతో ఆ ప్రాంతాన్ని సీజ్ చేసిన పోలీసుల, అక్కడ నుంచి కొన్ని అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.