ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా సంప్రోక్షణలోనూ భక్తులను అనుమతించాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 17, 2018, 11:00 AM

గతంలో మహా సంప్రోక్షణ జరిగిన సమయంలో ఎటువంటి విధానాలను పాటించారో, ఇప్పుడు కూడా అదే విధానాన్ని పాటించాలని, ఆలయంలోకి భక్తులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. తిరుమల ఆలయంలో దర్శనాల నిలిపివేత అంశంపై విమర్శలు వస్తున్న వేళ, ఈ ఉదయం అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఆయన, పరిమిత సంఖ్యలో అయినా సరే భక్తులకు స్వామి దర్శనం చేయించాలని ఆదేశించారు. ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే మహా సంప్రోక్షణ క్రతువుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులకు ఆయన సూచించారు. తిరుమలలో భక్తులు రోజుల తరబడి దర్శనానికి ఎదురుచూసేలా చేయవద్దని ఆయన తెలిపారు. గతంలో 1994, 2006 సంవత్సరాల్లో ఇదే క్రతువు జరిగినప్పుడు పాటించిన నిబంధనలనే ఇప్పుడూ పాటించాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com