ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇథియోపియా ప్రధాని ర్యాలీలో పేలుడు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 23, 2018, 02:14 PM

అడిస్ అబబా: ఇథియోపియా నూతన ప్రధాని అబే అహ్మద్ నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు చోటుచేసుకున్నది. అడిస్ అబబాలో జరిగిన ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. ఆ సభలో పేలుడు జరగడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రసంగం పూర్తి కాగానే ప్రధాని అబే అహ్మద్‌ను సెక్యూర్టీ దళాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. పేలుడులో అనేక మంది గాయపడినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ప్రధాని హెయిలిమరియమ్ డిసలేన్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఆయనకు వారసుడిగా అబే అహ్మద్ ఆ బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని ఒరోమో తెగకు చెందిన మొదటి నేతగా అబే అహ్మద్‌ను గుర్తిస్తున్నారు. ఇథియోపియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, రాజకీయ రెబల్స్‌ను వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ర్యాలీలో జరిగిన పేలుడులో పలువురు చనిపోయినట్లు ఆ తర్వాత ప్రధాని ఓ ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com