న్యూఢిల్లి : చైనాలో బాలీవుడ్ చిత్రాలను ప్రమోట్ చేయడంలో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ విశేష కృషి సల్పుతున్నారని భారతదేశంలో చైనా రాయబారి లుయోఝావోహుయి అన్నారు. అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రాన్ని జిన్‌పింగ్ అనేక సందర్బాల్లో చూశారని హుయి చెప్పారు. చైనా యువతలో ప్రస్తుతం యోగా సాధన, బాలీవుడ్ చిత్రాల వీక్షణ, డార్జిలింగ్ టీ సేవనం ఒక ఫ్యాషన్‌గా మారాయని ఆయన అన్నారు.