ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 71వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లాలూ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్‌ల మధ్య విభేదాలున్నప్పటికీ లాలూ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. లాలూ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ యాదవ్ తనను పార్టీనుంచి పక్కకు తప్పిస్తున్నారంటూ తన సోదరుడు తేజస్వి యాదవ్‌పై విమర్శలు చేస్తూ వీడియో ఒకటి ఇటీవల ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో లాలూ జన్మదిన వేడుకలు కుటుంబమంతా ఒక్కటిగానే ఉందని చెప్పడానికి ఉపకరిస్తోంది.