తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 11, 2018, 11:53 AM
 

 తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని గదులు నిండగా, వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా ఆదివారం స్వామి వారిని 1,01,139మంది భక్తులు దర్శించుకోగా, 39,941 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారి హుండీకి రూ.3.11కోట్ల ఆదాయం వచ్చింది.