అసెంబ్లీకి హాజరుకావడం లేదని కేజ్రీవాల్‌పై కేసు

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 11, 2018, 11:45 AM
 

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌పై ఎమ్మెల్యే కపిల్ మిశ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 10 శాతం కూడా హాజరుకాలేదని, ముఖ్యమంత్రి జీతంలో కోత విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.