కింగ్డావో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఇందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చైనాలోని కింగ్డాలో నిర్వహించిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొన్న పుతిన్ మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రియాతోపాటు మరికొన్ని దేశాలు తాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీకావాలని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఇందుకు అమెరికాలోని వైట్‌హౌస్ అధికారులు కృషిచేయాలని ఆయన కోరారు. కాగా అమెరికా..ఇరాన్‌తో అణుఒప్పందాన్ని విరమించుకోవడాన్ని పుతిన్ విమర్శించారు.