ఆధార్‌ లేకపోతే మధ్యాహ్నం భోజనం ఉండదు ... విద్యార్థులు, వంటవారు ‘గుర్తింపు’ చూపించాల్సిందే త్వరలో పాఠశాలలకు నోటిఫికేషన్‌ జారీ

Updated: Sat, Mar 04, 2017, 09:22 AM
 

దిల్లీ: మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న వంటవారు, విద్యార్థులకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసింది. ఇప్పటికీ ఆధార్‌కార్డు లేనివారికి జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించింది. పాఠశాల విద్యకు సంబంధించిన రాయితీ పథకాలను ఆధార్‌తో అనుసంధానించడానికి కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఉపక్రమించింది. మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకతకు, సమర్థంగా అమలు చేసేందుకు ఆధార్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ మేరకు పాఠశాలలకు నోటిఫికేషన్‌ పంపించనున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. వంటవారు/సహాయకులను కూడా లబ్ధిదారులుగానే పరిగణిస్తున్నామని, అందుకే వారు కూడా ఆధార్‌ను చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Andhra Pradesh E-Paper


Telangana E-Paper