నవ నిర్మాణ దీక్షపై చంద్రబాబు సమీక్ష

  Written by : Suryaa Desk Updated: Thu, May 24, 2018, 02:27 PM
 

రాష్ట్రానికి అన్యాయం జరిగితే వేడుకలు ఎలా చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర అవరతణ దినోత్సవం జరుపుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఆ రోజు నవ నిర్మాణ దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. నవ నిర్మాణ దీక్షపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈసారి కూడా విజయవాడలోని బెంజి సర్కిల్‌ వద్ద నవ నిర్మాణ దీక్ష నిర్వహించనున్నారు.